అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు...
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు".
దృఢమైనది
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
వివరణ
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి రెండు లక్షణాలను గురించి అడుగుతాడు – ఒకవేళ అవి గానీ ప్రజలలో ఉంటే, అవి వారిని అనివార్యంగా స్వర్గములోనికి లేదా నరకము లోనికి ప్రవేశింపజేస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: అనివార్యంగా ఒక వ్యక్తిని స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఏకైకుడైన అల్లాహ్ కు ఎవరినీ లేక దేనిని సాటి కల్పించకుండా, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించే లక్షణం. ఆ లక్షణం కలిగిన వ్యక్తి అదే స్థితిలో మరణించినట్లయితే, అతడు స్వర్గములోనికి అనివార్యంగా ప్రవేశించబడతాడు. అలాగే అనివార్యంగా ఒక వ్యక్తిని నరకములోనికి ప్రవేశింపజేసే ఆ లక్షణం ఏమిటంటే; ఒక వ్యక్తి అల్లాహ్ తో పాటు మరొకరిని కూడా ఆరాధిస్తూ, ఆయన ఏకత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన దైవత్వములో, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలలో, లక్షణాలలో ఇతరులను భాగస్వాములుగా చేసే లక్షణం. ఎవరైతే అలా చేస్తూ (షిర్క్ చేస్తున్న స్థితిలో) చనిపోతాడో, అతడు అనివార్యంగా నరకం లోనికి ప్రవేశపెట్టబడతాడు.
Hadeeth benefits
ఇందులో అల్లాహ్ ఏకత్వము యొక్క ఘనత ఉన్నది. ఒక విశ్వాసి, కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తున్న స్థితిలో, ఎవరినీ ఆయనకు సాటి కల్పించకుండా చనిపోయినట్లయితే, అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.
అలాగే ఇందులో అనేక దేవుళ్లను (బహుదైవాలను) ఆరాధించడంలోని ప్రమాదకరమైన భవిత కూడా ఉన్నది. ఎవరైతే అల్లాహ్ తో పాటు మరెవరినైనా ఆరాధిస్తారో (అంటే వేరే వారిని ఆయనకు సాటిగా నిలబెడతారో) వారు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తారు.
కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే ఏకదైవారాధకులు ఏవైనా అవిధేయకరమైన పనులకు పాల్బడితే అంటే పాపపు పనులకు పాల్బడితే. వారి భవిత అల్లాహ్ యొక్క ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. అల్లాహ్ తలుచుకుంటే వారిని క్షమిస్తాడు లేక ఆయన తలుచుకుంటే వారిని శిక్షిస్తాడు. కానీ, చివరికి వారి గమ్యస్థానము స్వర్గమే అవుతుంది.
Share
Use the QR code to easily share the message of Islam with others