{నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు[1]. కావున ఎవడు (కఅబహ్) గృహానికి 'హజ్జ్ లేక 'ఉమ్రా కొరకు పోతాడో[2], అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు[3], సర్వజ్ఞుడు.} (సూరహ్ అల్-బఖరహ్
: 158).
{వారిలో మరికొందరు: "ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు!" అని ప్రార్థిస్తారు.} (సూరహ్ అల్-బఖరహ్
: 201).
{అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు[1]. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది[2]. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).} (సూరహ్ ఆలె ఇమ్రాన్
: 97).
{ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి.[1] మీ కొరకు పచ్చిన మేసే చతుష్పాద పశువులన్నీ[2] (తినటానికి) ధర్మ సమ్మతం (హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మ సమ్మతం కాదు.[3] నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు.} (సూరహ్ అల్-మాఇదహ్
: 1).
{వారు, తమ కొరకు ఇక్కడ ఉన్న ప్రయోజనాలను అనుభవించటానికి మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరించి (జిబహ్ చేయటానికి), కావున దానిని (వాటి మాంసాన్ని) తినండి మరియు లేమికి గురి అయిన నిరుపేదలకు తినిపించండి.[1]} (సూరహ్ అల్-హజ్
: 28).