“ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధ...
తారిఖ్ ఇబ్న్ అషీం అల్ అష్జఈ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము).
దృఢమైనది
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు – ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని నాలుకతో ఉచ్ఛరిస్తూ, సాక్ష్యము పలుకుతాడో, అంటే - అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యము పలుకుతాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (తిరస్కరిస్తాడో), మరియు ఇస్లాం తప్ప మిగతా ఏ ధర్మముతోనూ నాకు సంబంధం లేదు అని నిరాకరిస్తాడో – అపుడు అతని సంపద, మరియు అతని రక్తము మిగతా విశ్వాసుల కొరకు నిషేధమై పోతుంది (హరాం అయిపోతుంది). అది మనది కాదు, మనకు కేవలం అతని బాహ్య ఆచరణలతో మాత్రమే సంబంధం ఉంటుంది. అతని సంపద తీసుకొనబడదు, మరియు అతని రక్తము చిందించబడదు – ఇస్లామీయ చట్ట ప్రకారము అతని సంపదను తీసివేసుకునే, లేక అతని రక్తాన్ని చిందించ వలసి వచ్చే నేరము అతడు చేస్తే తప్ప.
తీర్పు దినమున అతని లెక్కా పత్రము అల్లాహ్ తీసుకుంటాడు. అతడు నిజాయితీ పరుడైతే (సద్వర్తనుడైతే) అల్లాహ్ అతనికి ప్రతిఫలాన్నిస్తాడు, ఒకవేళ అతడు కపటుడైతే అల్లాహ్ అతడిని శిక్షిస్తాడు.
Hadeeth benefits
ఇస్లాం స్వీకరించి దానిలోనికి ప్రవేశించడానికి ప్రధాన షరతు (Condition) ఏమిటంటే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని (మనస్పూర్తిగా నమ్ముతూ, నాలుకతో ఉచ్ఛరిస్తూ) సాక్ష్యము పలుకుట, మరియు అల్లాహ్ ను తప్ప ఆరాధించబడే ప్రతి దానినీ నిరసించుట.
“లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ అరాధ్యూడెవరూ లేరు) యొక్క అర్థములోనే, ఆయనను తప్ప ఆరాధించబదే ప్రతి దానినీ నిరసించడం (అవిశ్వసించడం) ఉన్నది, అంటే ఉదాహరణకు: శిల్పాలు, బొమ్మలు, సమాధులను పూజించడం వగైరా.
ఎవరైతే “తౌహీదు” ను (అంటే కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటను) మరియు దానికి సంబంధించిన నియమాలను, చట్టాలను బాహ్యంగా అంటిపెట్టుకుని ఉంటాడో, ఆ విధంగా ఉండడం అతని కొరకు విధి అయిపోతుంది – దానికి వ్యతిరేకంగా అతని నుండి మరింకే ఆచరణ ప్రస్ఫుటం కానంత వరకు.
ఇస్లామీయ చట్టము ప్రకారము తప్ప, ఒక ముస్లిం యొక్క సంపద మరియు అతని రక్తము మిగతా విశ్వాసుల కొరకు హరాం (నిషేధము).
ఈ ప్రపంచములో తీర్పు (నిర్ణయం) బాహ్యంగా ప్రస్పుటమయ్యే విషయాల ఆధారంగానే ఉంటుంది. తీర్పుదినమున సంకల్పాలను అనుసరించి మరియు అతని లక్ష్యాలను అనుసరించి ఉంటుంది.
Share
Use the QR code to easily share the message of Islam with others