“నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు...
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు “ఓ ము’ఆద్! నీకు తెలుసా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో, అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు.” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఈ శుభ వార్తను ప్రజలకు వినిపించవచ్చా?” అని అడిగాను. ఆయన “వారికీ శుభవార్తను వినిపించకు. అలా చేస్తే, వారు కేవలం దీని పైనే ఆధారపడి పోతారు” అన్నారు.
దృఢమైనది
ముత్తఫిఖ్ అలైహి
వివరణ
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే వారు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఎవరినీ, దేనీనీ ఆయనకు సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే ఎవరైతే ‘అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని విశ్వసిస్తారో మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించరో, అటువంటి వారిని అల్లాహ్ శిక్షించడు. అపుడు ము’ఆద్ రజియల్లాహు అన్హు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శుభవార్తను ప్రజలకు వినిపించవద్దా. వారు (అల్లాహ్ యొక్క) ఈ అనుగ్రహం పట్ల ఆనంద పడతారు, సంతోషపడతారు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు కేవలం దీనిపైనే ఎక్కడ ఆధార పడతారోనని భయపడి, ఆయనను వారించారు.
Hadeeth benefits
ఇది దాసులపై విధిగా చేయబడిన అల్లాహ్ యొక్క హక్కుకు సంబంధించి ఒక తిరుగు లేని ప్రకటన. అది ఏమిటంటే, దాసులు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ లేక దేనినీ ఆయనకు సాటి కల్పించరాదు.
ఇందులో అల్లాహ్ పై దాసుల యొక్క హక్కుకు సంబంధించిన వివరణ ఉన్నది. అటువంటి వారిపై ఒక అనుగ్రహంలా, ఒక వరంలా, దాసుల యొక్క హక్కును అల్లాహ్ తనపై విధిగా చేసుకున్నాడు – అటువంటి వారిని అల్లాహ్ స్వర్గములో ప్రవేశింప జేస్తాడు మరియు వారిని శిక్షించడు.
ఇందులో కేవలం మహోన్నతుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని ఏకదైవారాధకులకు వారి అంతిమ గమ్యస్థానము స్వర్గమనే శుభ వార్త ఉన్నది.
తనకు తెలిసిన ఙ్ఞానాన్ని (ఇతరులకు చేరవేయకుండా) దాచుకున్న పాపములో ఎక్కడ పడిపోతానో అనే భయంతో, ము’ఆద్ రజియల్లాహు అన్హు ఈ హదీసును తన మరణానికి ముందు ఉల్లేఖించారు.
ఇందులో, వారు సరిగా అర్థం చేసుకోలేరేమో అనే సందేహం ఉంటే, కొన్ని హదీసులను కొద్ది మందికి తెలియ జేయక పోవడమే మంచిది అనే హెచ్చరిక ఉన్నది. ఎందుకంటే అందులో కేవలం ఈ ఆచరణ మాత్రమే చేయలనే పరిమితి లేదు. అలాగే సత్కార్యములకు షరియత్’లో ఒక హద్దు అనేది లేదు.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, ఎవరినీ లేక దేనినీ ఆయనకు సాటి కల్పించని ఏకదైవారాధకులు ఒకవేళ అవిధేయతకు, పాపపు పనులకు పాల్బడితే, వారి భవిత అల్లాహ్ యొక్క తీర్పుకు లోబడి ఉంటుంది. ఆయన తలుచుకుంటే వారిని శిక్షిస్తాడు, ఆయన తలుచుకుంటే వారిని క్షమిస్తాడు. చివరికి వారిని స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడు.
Share
Use the QR code to easily share the message of Islam with others